News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన మేయర్

దసరా పండుగ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని, చెడుపై మంచి గెలుపు, అధర్మంపై ధర్మం విజయాన్ని సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో స్నేహం, ఐక్యత, శాంతి, సత్ప్రవర్తనను ప్రోత్సహించాలని కోరారు. నగర ప్రజలకు సంక్షేమం, సుఖసంతోషాలు సర్వదా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.
Similar News
News November 28, 2025
HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
HYD: రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్

నకిలీ IPS శశికాంత్‌ను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు షేక్ పేటలోని అపర్ణ ఔరా అపార్ట్ మెంట్‌కు వెళ్లి తాళం తీసి వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్ రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచ్‌పై పడింది. వీడియోకు చిక్కకుండా వాచీని చేజిక్కించుకోగలిగినా మరో కానిస్టేబుల్ కంట పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువులు కాజేశాడు.


