News October 2, 2024

HYD: ‘ద‌స‌రా సెల‌వుల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు’

image

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఈ నెల 14 వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఇస్తున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. 15వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాలు పాటించ‌కుండా ప్రత్యేక క్లాసెస్, ట్యూషన్లు వంటివి కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ నిర్వ‌హిస్తే, అలాంటి పాఠ‌శాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Similar News

News November 30, 2025

రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్‌లకు 929 నామినేషన్లు

image

తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లను ఆహ్వానించగా.. సర్పంచ్‌కు 929 నామినేషన్లు, వార్డులకు 3,327 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ మూడో తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది.

News November 30, 2025

చేవెళ్ల, కందుకూరులో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

image

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, కందుకూరు రెవెన్యూ డివిజన్లలోని 7 మండలాల్లో ఆదివారం నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శంకర్‌పల్లి, చేవెళ్ల, ఆమనగల్లు సహా 7 మండలాల్లోని 178 పంచాయతీ, 1,540 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 2 తుది గడువు. ఉపసంహరణ 6న కాగా, పోలింగ్, కౌంటింగ్ 14న జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

News November 30, 2025

రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణి రద్దు

image

రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లా ప్రజలు, పిర్యాదుదారులు సహకరించాలని కలెక్టర్ కోరారు.