News September 20, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

Similar News

News November 14, 2024

HYD‌లో కిలో చికెన్ రూ.162

image

HYDలో చికెన్ ధరలు‌ భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గతవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. గురువారం స్కిన్ లెస్ KG రూ. 185, విత్ స్కిన్ రూ. 162కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
SHARE IT

News November 14, 2024

HYD: రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్

image

గ్రేటర్ HYD పరిధిలోని పలు రెస్టారెంట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. మొఘల్ రెస్టారెంట్, డైన్‌హిల్ మండి రెస్టారెంట్లలో చికెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. పాడైపోయిన మాంసాన్ని, ఫ్రిడ్జ్‌లతలో నిల్వ చేసినట్లు గుర్తించాం అన్నారు. హోటల్ నిర్వహణ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.

News November 13, 2024

డీఆర్డీఎల్‌ను సందర్శించిన రాధా మోహన్ సింగ్

image

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో కమిటీ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL)ని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్షిపణి ప్రదర్శన కేంద్రాన్ని ఛైర్మన్ ప్రారంభించారు. భారతదేశం రక్షణ సాంకేతికతలలో కొనసాగుతున్న పురోగతిని సమీక్షించడం, క్షిపణి అభివృద్ధిలో భవిష్యత్తు పరిశోధన దిశలను అంచనా వేయడం ఈ పర్యటన లక్ష్యమన్నారు.