News February 11, 2025
HYD: దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్లోని నాచారానికి చెందిన వారు మృతి చెందడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
Similar News
News November 28, 2025
OU: పూర్తిస్థాయి కమిటీని ఎప్పుడు నియమిస్తారో?

ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఓయూ ఈసీ కమిటీ ఖాళీలతో నడుస్తోంది. వర్సిటీలో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈసీనే కీలకం. అలాంటిది సర్కారు ఈ విషయం గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసీలో 12 మందికి గానూ వీసీ ప్రొ.కుమార్, డా.యోగితా రాణా, శ్రీదేవసేన, సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు.

గచ్చిబౌలిలో RS బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

RS బ్రదర్స్ 16వ షోరూమ్ను గచ్చిబౌలిలో మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలను ప్రతిబింబిస్తూ.. వివాహ వేడుకలకు అవసరమైన కొనుగోళ్లకు గమ్యంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబైన షోరూం ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవంలో ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ రాజమౌళి, ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.