News October 2, 2024

HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!

image

HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT

Similar News

News October 29, 2025

ఓయూ: నవంబర్‌లో డిగ్రీ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. BA, B COM, BSC, BBA, BSW, తదితర కోర్సుల మూడు, ఐదోవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 12 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News October 29, 2025

CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

image

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌‌తో ఏదో మాట్లాడారు.

News October 29, 2025

గంజాయి లేడి డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు

image

హైదరాబాద్ గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పీడీ యాక్ట్‌పై ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధూల్‌పేట్‌ నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ అనేక కేసుల్లో నిందితురాలైన అంగూర్ భాయ్‌పై ప్రభుత్వం అమలు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.