News February 28, 2025
HYD: దేశ రక్షణ బాధ్యత యువతపై ఉంది: సీఎం

గచ్చిబౌలిలోని స్టేడియంలో జాతీయ సైన్స్ సందర్భంగా విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణ బాధ్యత యువతీ, యువకులపై ఉందని, దేశ రక్షణలో HYD దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. BDL, HAL, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని, సైన్స్ ద్వారా విద్యార్థులకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు.
Similar News
News March 15, 2025
విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
News March 15, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.
News March 15, 2025
వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.