News January 20, 2025
HYD: దోబీ అనే పదం వద్దని కేంద్ర మంత్రికి వినతి

దోబీ అనే పదంతో తెలుగు రాష్ట్రాల్లో రజకుల హక్కులకు భంగం కలుగుతోందని రాష్ట్ర రజక మహిళా సంఘం ఫౌండర్ ఛైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు పట్నా హైకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాలను తెలుపుతూ ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ గెజిట్‌లో దోబీ అనే పదంతో ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరిగి స్థానికంగా ఉన్న రజకులకు అన్యాయం జరుగుతోందని ఆమె వాపోయారు.
Similar News
News February 12, 2025
శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు

శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.
News February 12, 2025
HYD: పిల్లాడిని ఎత్తుకెళ్లారు.. ఇద్దరి అరెస్ట్

HYD కాచిగూడలో మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు అయ్యింది. 2 నెలల మగ శిశువును కాచిగూడ పోలీసులు వారి నుంచి రక్షించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కాచిగూడ డీమార్ట్‌లో బట్టలు కొనడానికి వెళ్లిన తల్లి, బట్టలు సెలెక్ట్ చేయడానికి బాబును పట్టుకొమ్మని నిందితుడికి ఇచ్చింది. దీంతో నిందితుడు అతడి తల్లి, బాబుతో ట్యాక్సీలో పరారవగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్‌కు కాల్ చేయండి..!

చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్‌ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.