News August 4, 2024
HYD: దోస్తానా అంటే మాకు ప్రాణం!

దోస్తానా అంటే HYD, రంగారెడ్డి వాసులు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు రాజధానిలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడు ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. ఫెయిర్ వెల్ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
Similar News
News November 28, 2025
శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News November 28, 2025
HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.


