News June 23, 2024

HYD: నంబర్ ప్లేట్ మార్చితే చీటింగ్ కేసులు నమోదు

image

చలానాల నుంచి తప్పించుకునేందుకు పలువురు వాహనాల నంబర్ ప్లేట్ తారుమారు చేయటం, కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ HYDలో నంబరు ప్లేటు లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న 85 వాహనాల్లో 35 మంది యజమానులపై కేసు నమోదు చేశారు. 40 మంది మైనర్లను పట్టుకున్నారు.180/177 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.

Similar News

News November 11, 2024

ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

image

ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు సులువుగా అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో బస్‌పాస్ ఉన్నవారు తమ బస్‌పాస్‌తో ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10% డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. జనవరి 30వ తేదీ వరకు ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 11, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చలి!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్‌చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్‌, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.

News November 11, 2024

HYD: శంషాబాద్‌కు అఘోరీ

image

శంషాబాద్‌లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి ప్రకటించారు. ఏపీ గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె ఆదివారం మాట్లాడారు. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.