News March 29, 2024

HYD: నకిలీ వజ్రాన్ని విక్రయిస్తున్న ముఠా ARREST

image

రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.సౌత్‌వెస్ట్‌ DCP ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్‌, సాజిద్‌ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

Similar News

News September 16, 2025

రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్‌లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

News September 16, 2025

HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

image

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.

News September 16, 2025

MGBS మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

image

దేశంలోనే పాస్‌పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.