News March 26, 2024

HYD నగరంలో ఏప్రిల్ నుంచి రూ.29 కిలో భారత్ రైస్..!

image

HYD నగరంలోని అత్తాపూర్ సహా పలుకాలనీల్లో కిలో భారత్ అట్టా(గోధుమపిండి) రూ.27.5, కిలో భారత్ దాల్ (శనగపప్పు) రూ.60ను మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయిస్తున్నట్లు కేంద్రీయ బండార్ సమితి తెలిపింది. కోఠిలోని భారత్ బండార్‌లో సైతం విక్రయిస్తున్నట్లు తెలిపారు. FCI నుంచి 2000 టన్నుల బియ్యం కేటాయింపులు జరిగాయని, నగరంలో ఏప్రిల్ నుంచి కిలో భారత్ రైస్ రూ.29 విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌‌లో మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.

News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

News October 16, 2025

HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి.. మోసపోయిన అబ్బాయి!

image

ఆన్‌లైన్ డేటింగ్, ఫ్రెండ్‌షిప్ స్కామ్‌లో పడ్డ వ్యక్తి రూ.6,49,840 పోగొట్టుకున్నాడు. మలక్‌పేట్‌కు చెందిన వ్యక్తి (32)కి డేటింగ్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి కుదురుస్తామని మాట్లాడి కొంత డబ్బు తీసుకుంది. అనంతరం ఓ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌లో యాడ్ చేసింది. అందులో ఉన్నవారి సూచనల మేరకు బాధితుడు విడతల వారీగా రూ.6,49,840 చెల్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.