News December 8, 2024

HYD నగరంలో మెరుగుపడ్డ గాలి నాణ్యత

image

HYDలో గత నెలతో పోలిస్తే పలుచోట్ల గాలి నాణ్యత మెరుగుపడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) రిపోర్ట్ విడుదల చేసింది. జూపార్క్-129, బొల్లారం-103, పటాన్‌చెరు-82, ECIL-70, సోమాజిగూడ-75, కోకాపేట-69, HCU-68, నాచారం-60, సనత్‌నగర్-50‌గా నమోదైంది. గత నెలలో సనత్‌నగర్‌‌లో AQI  ఏకంగా 150కి పైగా రికార్డైంది. AQI 100 ధాటితే శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ప్రమాదం.

Similar News

News January 21, 2025

శంషాబాద్: రికార్డు బ్రేక్ చేసిన ఎయిర్ పోర్ట్

image

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 జనవరి 18వ తేదీన ఒకే రోజు 94,630 మంది ప్రయాణికులను 607 విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చి గత రికార్డును బ్రేక్ చేసినట్లుగా RGIA బృందం తెలిపింది. గత రికార్డు 2024 డిసెంబర్ 22వ తేదీన ఒకేరోజు 92,000 మంది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించారు. గత డిసెంబర్ నెలలో 27 లక్షల మంది ప్రయాణించగా అందులో 23 లక్షల మంది స్వదేశీయులే అని తెలిపింది.

News January 21, 2025

HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

జామై ఉస్మానియాలో ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం

image

సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది