News September 9, 2024

HYD: నగరంలో వర్షాలతో తగ్గిన వాయు కాలుష్యం

image

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వాతావరణం పూర్తిగా మారింది. దీంతో కాలుష్య స్థాయులు తగ్గాయని పీసీబీ అధికారులు వెల్లడించారు. 10 కేంద్రాల్లో వాయునాణ్యత సూచీని లెక్కించగా 53గా నమోదైందని తెలిపారు. హెచ్సీయూ కేంద్రం వద్ద అత్యల్పంగా 23, న్యూమలక్‌పేట్ వద్ద అత్యధికంగా 73గా నాణ్యత సూచీ నమోదైందని వెల్లడించారు. జూ పార్కు 28, కొంపల్లి 55, ఈసీఐఎల్ 56, సనత్ నగర్ 59, నాచారం 62గా నమోదైంది.

Similar News

News November 26, 2025

విలీనం ఎఫెక్ట్.. GHMC ఎన్నికలు ఆలస్యం?

image

GHMC ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కార్పొరేటర్లు మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-16 మధ్య రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారులతో గ్రేటర్‌ అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ప్రస్తుతం 27 ULBలను విలీనానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో అన్నీ సర్దుబాటు అయ్యేవరకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టేలా ఉంది. ఫిబ్రవరి 10తో పాలకవర్గం ముసిగినా.. ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.

News November 26, 2025

పెరగనున్న గ్రేటర్ విస్తీర్ణం.. డివిజన్లు!

image

గ్రేటర్ విస్తీర్ణం ఫ్యూచర్‌లో భారీగా పెరగనుంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు ఉన్న GHMC విలీనం తర్వాత దాదాపు 2735 చదరపు KMకు పెరగనుంది. విలీనం తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోనూ అనేక మార్పులు రానున్నాయి. GHMC పరిధిలో ఇప్పటివరకు 150 డివిజన్లు ఉన్నాయి. అదనంగా కార్పొరేషన్లు(7), మున్సిపాలిటీలు(20) తోడైతే డివిజన్ల సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల సంఖ్య పెంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

News November 26, 2025

ఏడాదిలోనే మున్సిపాలిటీలోకి GPలు.. గ్రేటర్‌లోకి మున్సిపాలిటీలు

image

గత సంవత్సరం డిసెంబర్‌లో ORR పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత ఆ మున్సిపాలిటీలను ఇప్పుడు గ్రేటర్‌లో విలీనం చేసేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. అప్పుడు గ్రామాలను మున్సిపాలిటీలోకి.. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తీసుకువచ్చి గ్రేటర్ విస్తీర్ణం పెంచి ఆదాయం పెంచుకోవడంతో పాటు అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది.