News March 30, 2024
HYD నగరంలో హీటెక్కిస్తున్న సూరీడు!

గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 9, 2026
GHMC 3 ముక్కలు.. బాస్ ఆయనే!

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్‌ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్‌గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.
News February 9, 2026
HYDలో బండిపోతే ‘బండి’.. ఏమైంది బండి?: CM

నగరంలో వరదలు వస్తే లోతట్టు ఇళ్లు, వాహనాలు మునిగిపోతాయని CM రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వరదల సమస్యను ప్రచారంలో వాడుకున్న బండి సంజయ్ గత GHMC ఎన్నికల్లో దాదాపు 50 మందిని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. కానీ, ‘బండి పోతే బండి ఇస్తాం’ అన్న సంజయ్ ఆ హామీని నీరు గార్చారని, BJPకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.
News February 9, 2026
కాసేపట్లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ

మరికాసేపట్లో GHMC స్టాండింగ్ కమిటీ చివరి/ సాధారణ సమావేశం జరగనుంది. ఈ అజెండాలో మొత్తం 9 అంశాలను పొందుపరిచారు. కూకట్‌పల్లి జోన్‌లో క్రికెట్ పిచ్‌లు, షటిల్ కోర్టుల నిర్వహణకు కొత్త టెండర్లు, యూసుఫ్ నగర్ వైకుంఠధామం నిర్వహణ బాధ్యతలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు రూ. 3.45 కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణం, రూ. 2.45 కోట్లతో బాక్సింగ్ కోర్టు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు.


