News April 5, 2024

HYD నగరానికి నీళ్ల ఢోకా లేకుండా PLAN

image

HYD నగరంలో నీళ్ల ఢోకా లేకుండా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నగరానికి నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూర్, హిమాయత్‌ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రోజుకు దాదాపు 140 మిలియన్ లీటర్ల నీరు అధికంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి సాగర్, మే ఒకటి నుంచి ఎల్లంపల్లి ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

జూబ్లీహిల్స్‌లో GHMC మోడల్ ఫుట్‌పాత్

image

జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టు చేపట్టింది. రీసైకిల్ ప్లాస్టిక్ పేవర్లు, సోలార్ గ్రిడ్, టాక్టైల్ పేవింగ్‌తో పాదచారుల భద్రతను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫిల్మ్‌నగర్- బీవీబీ జంక్షన్ మధ్య ఉన్న బీజీ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణ హితంగా నిర్మించే ఈ ప్రాజెక్టు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 27, 2025

రంగారెడ్డి డీసీసీ ఆలస్యం ఎందుకు ‘అధ్యక్షా’

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.

News November 27, 2025

CUA మహా మాస్టర్ ప్లాన్‌: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

image

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్‌లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.