News August 25, 2024

HYD నగరానికి పూర్వవైభవం తీసుకొస్తాం: సీఎం

image

జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

image

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్‌ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.

News December 3, 2025

MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

image

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

image

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే విషయం ఖరారైంది. సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం పేరిణి నృత్యం, రాత్రి కొమ్ము కోయ డాన్స్, కీరవాణి సంగీత కార్యక్రమం, రెండో రోజు(మంగళవారం) ఉదయం వీణ వాయిద్యం, రాత్రి గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో, గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతం ఉండనుంది.