News April 25, 2024
HYD: నగర ప్రజలకుముఖ్య గమనిక

GHMC పరిధి ప్రజలకు ముఖ్య గమనిక. ప్రతి ఇళ్లు, అపార్ట్మెంట్ ముందు పైపుతో కడగొద్దు. బకెట్తో నీరు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు నుంచి నీరు వరద మాదిరిగా బయటకి రావొద్దు. ఆ విధంగా వచ్చినా, నీటి వృథా చేసినా GHMC/మున్సిపల్ వారు ఆ ఇంటికి రూ.5వేల జరిమానా వేస్తారు. ఎవరికి తెలియకుండానే ఉదయం ఫొటో తీయడం జరుగుతుందని హెచ్చరించారు. నీటిని ఆదా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.
News October 22, 2025
మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.