News July 28, 2024
HYD నగర ప్రజలకు ట్రాఫిక్ ALERT
HYD సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ZPHS యూటర్న్ నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వరకు దాదాపుగా జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు 5 రోజుల పాటు SRDP శిల్ప లేఅవుట్ ఫేజ్-2 వంతెన పనులు జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పును 3 మీటర్లకు కుదిస్తామన్నారు.కావునా.. కొత్తగూడ నుంచి వచ్చేవారు రోలింగ్ హిల్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లాలన్నారు.
Similar News
News October 5, 2024
BREAKING: HYD: ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ SUSPEND
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 5, 2024
HYD: ‘రేషన్ కార్డు లాగా FAMILY ఫొటో దిగాలి’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా RR, MDCL జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 26 చోట్ల సర్వే ప్రారంభమైంది. ముందు కుటుంబ పెద్దగా మహిళ పేరు, వివరాలు తీసుకుని ఆ తర్వాత మిగితా వారి డీటేల్స్‌ను అధికారులు తీసుకుంటున్నారు. కాగా ఫ్యామిలీ అంగీకరిస్తేనే రేషన్ కార్డు తరహాలో అంతా కలిసి ఉన్న ఒక ఫొటో తీసుకుంటున్నారు. SHARE IT
News October 5, 2024
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం: చంద్రశేఖర్
రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో 45 శాతం ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చిందని జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల నుంచి రూ.3,195 కోట్ల ఆదాయం వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం రావడం జరిగిందన్నారు.