News March 7, 2025
HYD: నగర విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11వేల చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.
Similar News
News December 22, 2025
FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News December 22, 2025
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 22, 2025
జీహెచ్ఎంసీ డిలిమిటేషన్పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు

జీహెచ్ఎంసీ డిలిమిటేషన్పై హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వార్డుల విభజన చేశారని లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వార్డుల మ్యాప్, జనాభా వివరాలపై సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.


