News March 7, 2025

HYD: నగర విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

image

HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11వేల చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.

Similar News

News March 18, 2025

ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్‌ కేసు

image

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.

News March 18, 2025

సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

image

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.

News March 18, 2025

వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

image

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్‌ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

error: Content is protected !!