News March 7, 2025
HYD: నగర విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో 11వేల చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.
Similar News
News March 10, 2025
MBNRలో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 700 ఏళ్లనాటి మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద పరిమాణం గల మూడో చెట్టుగా ఇది పేరుగాంచింది. దూరం నుంచి చూస్తే కొండలాగా కనిపించే ఇది దగ్గరికెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా మారిపోతుంది. మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దీని పక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలోనే ఉంది. సందర్శించారా? కామెంట్ చేయండి.
News March 10, 2025
మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సమచిత స్థానం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఖరారు చేసినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
News March 10, 2025
వర్గల్: పెళ్లిలో డిజిటల్ కట్నాల చదివింపులు

పెళ్లిలో ఇంతకాలం పెళ్లికూతురు, పెళ్ళికొడుకు కట్నాల చదివింపులు రాతపూర్వకంగా ఉండేవి. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం కొత్త ట్రెండు మొదలైంది. అంతా డిజిటలైజేషన్ కావడంతో వర్గల్ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు తరపున చదివింపుల కార్యక్రమంలో ఫోన్‌పే స్కానర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా చదివింపులు చేపట్టారు.