News September 9, 2024

HYD: నరాల సమస్యకు నిమ్స్ ఆధునిక వైద్యం

image

నరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఆధునిక వైద్యం అందించేందుకు టీఎంఎస్ యంత్రం అందుబాటులోకి వచ్చిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప చెప్పారు. ఆదివారం ఆసుపత్రి కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈయంత్రం సాయంతో మెదడులో ఏవైనా సమస్యలు తలెత్తితే బైపాస్ పద్ధతిలో చికిత్స చేసి తిరిగి పూర్వస్థితికి తీసుకురావచ్చన్నారు. రూ.2 కోట్ల విలువైన టీఎంఎస్ యంత్రంతో తక్కువ సమయంలో ఆధునిక వైద్యం అందించవచ్చని తెలిపారు.

Similar News

News December 4, 2025

GHMC మెగా విలీనంపై అడ్డంకులు.. మరో ఏడాది HMDA నిబంధనలే!

image

విశాలమైన GHMC ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనా క్షేత్రస్థాయిలో పాలనా ప్రణాళికకు అడ్డంకులు తప్పడం లేదు. 27 ULBs‌ను విలీనం చేసినప్పటికీ పౌరులకు ఏకరూప నిబంధనలు ఇప్పట్లో అందుబాటులోకి రావు. విలీన ప్రాంతాల్లో ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ 2013 జోనల్ నిబంధనలే ఇంకో ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంక్లిష్టమైన రూల్స్‌ను ఏకీకృతం చేయడంలో అధికారుల జాప్యం కారణంగా కొత్త GHMC, HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఆలస్యం కానుంది.

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్: 22 కిలో మీటర్ల మార్గంలో పోలీసుల తనిఖీలు

image

గ్లోబల్ సమ్మిట్ కోసం భద్రత అసాధారణ స్థాయికి చేరింది. తుక్కుగూడ నుంచి మీర్ఖాన్​పేట్ వరకు ఉన్న 22KM మార్గంలో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు అణువణువూ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఆరు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 24 నుంచే ప్రధాన భద్రతాధికారి హై అలర్ట్ ప్రకటించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News December 4, 2025

HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

image

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.