News July 8, 2024
HYD: ‘నర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు’

T.I.M.S నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని వారు వాపోతున్నారు. తాము జీతాలు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News November 17, 2025
HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.
News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News November 17, 2025
HYD: ప్రమాదంపై చర్యలు వేగవంతం: సీఎస్

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై చర్యలు వేగవంతం చేసేందుకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం అందించేందుకు, సహాయం కల్పించేందుకు 24×7 హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుందన్నారు.


