News April 9, 2025
HYD: నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.
Similar News
News December 3, 2025
టాటా ట్రస్ట్ ఎలక్షన్ ఫండ్స్.. 83 శాతం బీజేపీకే

2024-25 లోక్‌సభ ఎలక్షన్ ఇయర్లో టాటా గ్రూప్ అనుబంధ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి BJPకి రూ.757 కోట్ల ఫండ్స్ అందాయి. ట్రస్ట్ అందించిన మొత్తం నిధుల్లో ఇది 83% కాగా 8.4% వాటాతో కాంగ్రెస్ రూ.77.3 కోట్లు అందుకుంది. ఈసీకి అందించిన వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల సమయంలో BJP, కాంగ్రెస్ సహా 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్ల నిధులొచ్చాయి. YCP, BRS తదితర పార్టీలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చింది.
News December 3, 2025
ఖమ్మం జిల్లాలో 6 బయో-ఇన్పుట్ సెంటర్లు

రాష్ట్రంలో సేంద్రీయ సాగు ప్రోత్సాహకానికి 250 బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభ సమావేశాల్లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జిల్లాలో ఇటువంటి కేంద్రాలు ఆరు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకుబీజామృత్, జీవామృత్, నీమాస్త్రం వంటి సేంద్రీయ ఎరువులను అందిస్తున్నట్లు వెల్లడించారు.
News December 3, 2025
నామినేషన్ల కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్‌తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా కలిగి ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. హెల్ప్ డెస్క్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.


