News August 24, 2024
HYD: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ ఉపసంచాలకులు టీ.గోపాలకృష్ణ గచ్చిబౌలిలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 18న ఉంటుందన్నారు.
Similar News
News October 17, 2025
యూసుఫ్‌గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.