News September 19, 2024

HYD: నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు పొడిగింపు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గచ్చిబౌలి నవోదయ విద్యాలయం ప్రధానాచార్యుడు డి.విజయ్ భాస్కర్ శుభవార్త చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష గడువును పొడిగించినట్లు వెల్లడించారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News November 25, 2024

HYD: సైకిళ్లపై రాచకొండ పోలీసుల పెట్రోలింగ్..!

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చర్లపల్లి, ఉప్పల్, కందుకూరు, ఎల్బీనగర్ సహా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిళ్లపై వెళ్లి ప్రజలు, యువతను కలిసి యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, డయల్ 100, ఉమెన్ సేఫ్టీ, సోషల్ మీడియాలో మోసాలపై వివరిస్తున్నారు. మహిళా పోలీసులు సైతం ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

News November 25, 2024

HYD: తెలుగులో భారత రాజ్యాంగం

image

HYDలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న సూరన ఆడిటోరియంలో భారత రాజ్యాంగ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి DSP చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని, భారత పౌరులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

News November 25, 2024

HYD: లోక్‌మంథన్ ఫెస్టివల్ ఘనంగా ముగింపు

image

శిల్పకళ వేదికలో లోక్‌మంథన్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. వనవాసి గ్రామవాసి, నగరవాసి అందరూ భారతీయులే అని తెలిపారు. దేశ సంస్కృతి ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శించారని చెప్పారు. దేశంలో స్వార్థం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, గజేంద్ర శెఖావత్ పాల్గొన్నారు.