News April 10, 2024
HYD: నాకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ MIMకు మద్దతిచ్చినట్టే: ఫిరోజ్‌ఖాన్

HYDలో ఒవైసీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేత ఫిరోజ్‌ఖాన్ అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని, కాంగ్రెస్ పరోక్షంగా MIMకు మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదేమైనా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మీ కామెంట్?
Similar News
News February 9, 2026
రంగారెడ్డిలో నేటితో గప్ చుప్

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేడు సా.5 గంటలకు ముగియనుంది. దీంతో మైక్‌లు మూగబోనున్నాయి. డప్పుల హోరు.. నేతల ప్రసంగాల జోరుకు బ్రేక్ పడనుంది. కాగా.. ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఆదివారం ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలతో హోరెత్తించారు. ఆఖరి ఘట్టమైన తాయిలాల పంపిణీకి అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
News February 9, 2026
రంగారెడ్డి జిల్లాలో 274 పోలింగ్ కేంద్రాలు

ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. RR జిల్లాలోని 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా..వీరి కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500-800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించి,ఓటింగ్‌కు సిద్ధంగా ఉంచింది.
News February 8, 2026
HYD: రేపు జయశంకర్ అగ్రీ వర్సిటీ స్నాతకోత్సవం

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య తెలిపారు. ముడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్నాతకోత్సవాలను ఒకేసారి వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి హాజరుకానున్నట్లు తెలిపారు.


