News November 25, 2024
HYD: నాగార్జునసాగర్ వెళ్తున్నారా? మీకోసమే!
HYD ప్రజలు నాగార్జునసాగర్ టూర్ వెళ్లేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ టూర్లో 274 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బుద్ధవనం, మనోహరమైన శిల్పాలు, గౌతమ బుద్ధుడి స్ఫూర్తి దాయకమైన జీవిత కథను ప్రదర్శించే ప్రత్యేకమైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌లో గడపొచ్చాన్నారు. www.tourism.telangana.gov.in ద్వారా టూర్ బుక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 6, 2024
మేడ్చల్: అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలు
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ ఇందుస్ యూనివర్సల్ పాఠశాలలో అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, వారి ప్రతిభను కనబరిచారు. అవినీతి అనేది ఆర్థిక వ్యవస్థను, పాలన వ్యవస్థను చింద్రం చేస్తుందని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.
News December 6, 2024
HYD: డా.బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన కేటీఆర్
భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం కోసం ఆయన ఎనలేని త్యాగాలు చేశారని, ఆయన ఆశయ సాధనతో ముందుకు వెళ్తామన్నారు.
News December 6, 2024
HYD: యూనివర్సిటీల అభివృద్ధిపై ఫోకస్
HYD యూనివర్సిటీల అభివృద్ధిపై విద్యా కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మౌలిక వసతుల కల్పన, ఖాళీల భర్తీ, పరిశోధనలు, అభివృద్ధి, ఆచార్యులు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, ప్రభుత్వ బకాయిలను గుర్తించడంపై పంచసూత్ర ప్రణాళిక రూపొందించింది. ఉస్మానియా, జేఎన్టీయూ లాంటి అనేక యూనివర్సిటీలను అభివృద్ధి చేయనున్నారు.