News August 14, 2024

HYD: నాగోల్‌‌ మెట్రో స్టేషన్‌లో FREE పార్కింగ్ ఎత్తివేత..!

image

HYD నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్‌ స్థలంలో నిన్నటి వరకు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసేవారు. నేటి నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. బైక్‌లు మినిమం 2 గంటల వరకు నిలిపి ఉంచితే రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు నిలిపితే రూ. 40 చొప్పున చెల్లించాలి కారు పార్కింగ్ ధరలు‌ వీటికంటే మూడింతలు ఎక్కువగా నిర్ణయించారు. దీనిపై‌ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

రేవంత్‌‌‌కు KTR “జూబ్లీహిల్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్” కౌంటర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముమ్మరం కావడంతో BRS పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలుపై రేవంత్ రెడ్డి, KTR ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు KTR త్వరలో కౌంటర్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. BRS హయాంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు, ఫ్రీ వాటర్ ఇతర అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వనున్నారు.

News November 1, 2025

సిటీ ఆర్టీసీ బస్సులో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలు

image

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో నగరంలోని సిటీ బస్సుల్లో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రోడీలక్స్ బస్సులలో ఫైర్ ఎగ్జిటింగిషర్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వీటిని ఉపయోగించి మంటలను ఆర్పవచ్చు.