News November 2, 2024

HYD: నారాయణగూడలో నో ఎంట్రీ!

image

సదర్ ఉత్సవాలకు HYD నారాయణగూడ రెడీ అయ్యింది. దున్నరాజుల ప్రదర్శన చూసేందుకు ప్రతియేటా లక్షలాది మంది YMCAకు వస్తారు. దీంతో రాంకోఠి నుంచి నారాయణగూడ, బాగ్‌ లింగంపల్లి నుంచి కాచిగూడ, YMCA పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 7 నుంచి తెల్లవారుజామున 3 వరకు సాధారణ వాహనాలకు నారాయణగూడలో అనుమతి ఉండదు. ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
SHARE IT

Similar News

News November 18, 2025

HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

image

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో భారీగా స్థిరాస్తి విక్రయాలు

image

గ్రేటర్ HYDలో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ నాటికి 17,658 స్థిరాస్తులు విక్రయించినట్లుగా స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే టైమ్‌లో జరిగిన విక్రయాలతో పోలిస్తే 53% ఎక్కువ అని వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత గిరాకీ అధికంగా ఉన్న నగరాల్లో బెంగళూరు, చెన్నై ఉన్నట్లు పేర్కొంది.