News November 1, 2024
HYD: నారాయణగూడలో సదర్.. CM రేవంత్‌కి ఆహ్వానం
నారాయణగూడ YMCA చౌరస్తాలో రేపు నిర్వహించనున్న యాదవ సదర్ సమ్మేళనంకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. నిర్వాహకులు సి.వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను CMకు అందజేసింది. ప్రతిఏటా నారాయణగూడలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అధికారికంగా సదర్ నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు.
Similar News
News December 8, 2024
HYD: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షోకు వెళ్తున్నారా?
HYD హుస్సేన్ సాగర్ వద్ద జరిగే ఎయిర్ షోకి వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేశారు. PVNR మార్గ్, నెక్లెస్ రోడ్డులో కార్లు, టూ వీలర్ పార్కింగ్, ఆదర్శనగర్ గల్లీలో టూవీలర్, GHMC హెడ్ ఆఫీస్ గల్లీలో కార్లు, టూవీలర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోట్ క్లబ్‌లో మంత్రుల కార్లు, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద MLA, MP, MLC, IAS, నేతల వాహనాల పార్కింగ్ ఉంటుందని చెప్పారు.
News December 8, 2024
HYD: B1, B2 వీసాలకు ఫుల్ డిమాండ్..!
HYD నగరంలో B1,B2 వీసాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని US కాన్సులేట్ జెన్నిఫర్ తెలిపారు. వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలో భారతదేశ రికార్డును శనివారం నాడు బ్రేక్ చేసినట్లుగా వెల్లడించారు. కొత్త టెక్నాలజీ వినియోగం, పెరిగిన సిబ్బందితో నిరీక్షణ సమయం చాలా వరకు తగ్గిందని, సేవలను అద్భుతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు తమకు సంతోషంగా ఉందని తెలిపారు.
News December 8, 2024
HYD: ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్లకండి!
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద నేడు IAF ఎయిర్ షో జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్‌పై భారీ బందోబస్తును మోహరించారు. ఎక్కడికక్కడ బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని,వాహనాలను అనుమతించమని తెలిపారు. నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి వంతెన,VV స్టాచ్యూ, రవీంద్ర భారతి, కవాడిగూడ జంక్షన్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది.