News September 21, 2024

HYD: నాలుగేళ్లలో 50 వేల మందికి SKILL ట్రైనింగ్

image

వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని HYD నగరంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదు అయినట్లుగా పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

ఢిల్లీకి నవీన్ యాదవ్.. మతలబ్ ఏంటి?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్‌కు ఢిల్లీలో ప్రశంసలు వచ్చాయి. CM రేవంత్, dy.CM భట్టి, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. జూబ్లీలోని బస్తీ వాసులు గెలిపించిన నాయకుడు ఢిల్లీకి వెళ్లడం తాజా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పట్టులేని చోట కాంగ్రెస్‌ను నిలబెట్టిన యూసుఫ్‌గూడ బస్తీ వాసికి అదనపు బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది.

News November 15, 2025

HYD: 5 ఏళ్లలో 2 లక్షల కిడ్నీ కేసులు.. జర జాగ్రత్త..!

image

వయసుకు, ఆరోగ్యానికి సంబంధం లేకుండా కిడ్నీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో HYDలోని ఆసుపత్రుల్లో రెండు లక్షలకు పైగా మంది చికిత్స తీసుకోవడం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్సలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు అధికంగా నీరు తీసుకోవడంతోపాటు శారీరక శ్రమ చేయడం, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

News November 15, 2025

ఇక గాంధీ భవన్ చూపు.. గ్రేటర్ HYD వైపు..!

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఈ విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో పాగా వేయాలని గాంధీభవన్ ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు నాయకులు కేడర్‌కు దిశానిర్దేశం చేయనుంది. గ్రేటర్ HYDలో పక్కాగా ప్లాన్ వేసి వందకు తగ్గకుండా కార్పొరేటర్ సీట్లు సాధించి మేయర్ సీటు పట్టాలని ఆశిస్తోంది.