News September 21, 2024
HYD: నాలుగేళ్లలో 50 వేల మందికి SKILL ట్రైనింగ్
వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని HYD నగరంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదు అయినట్లుగా పేర్కొన్నారు.
Similar News
News October 5, 2024
BREAKING: HYD: ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ SUSPEND
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 5, 2024
HYD: ‘రేషన్ కార్డు లాగా FAMILY ఫొటో దిగాలి’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా RR, MDCL జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 26 చోట్ల సర్వే ప్రారంభమైంది. ముందు కుటుంబ పెద్దగా మహిళ పేరు, వివరాలు తీసుకుని ఆ తర్వాత మిగితా వారి డీటేల్స్‌ను అధికారులు తీసుకుంటున్నారు. కాగా ఫ్యామిలీ అంగీకరిస్తేనే రేషన్ కార్డు తరహాలో అంతా కలిసి ఉన్న ఒక ఫొటో తీసుకుంటున్నారు. SHARE IT
News October 5, 2024
శంషాబాద్: తండ్రిని హత్య చేసిన కొడుకు
రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. శంషాబాద్‌లో తండ్రిని కొడుకు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన రాములు తరచూ మద్యం తాగి గొడవ పడేవాడు. ఈ క్రమంలో రాములు తన కూతురు ఇంటి వద్ద గొడవ పడటంతో కోపోద్రిక్తుడైన అతడి కొడుకు శివకుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.