News April 10, 2025
HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.
Similar News
News December 3, 2025
వదల ‘బొమ్మా’ళి.. మళ్లీ కస్టడీ పిటిషన్

TG: ఐబొమ్మ రవి కేసులో మరో 4 కేసుల్లో కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని రవి న్యాయవాదిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఒకే కేసులో రవిని పోలీసులు రెండుసార్లు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అటు కస్టడీ పూర్తి కావడంతో రవి బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News December 3, 2025
ట్రాఫిక్ మానిటరింగ్ తప్పనిసరి: ఎస్పీ

నేషనల్ హైవేపై ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ తప్పని సరిగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. బుధవారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో హై వే, జీవీఎంసీ, ఆర్అండ్బీ అధికారులతో ఎస్పీ సమీక్షించి మాట్లాడారు. హైవేకు అనుబందంగా ఉన్న 11 పోలీస్ స్టేషన్లలో బ్లింకర్లు, ఇల్యూమినేషన్ లైట్స్, సోలార్ క్యాట్ ఐస్, సిగ్నల్ సైన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
News December 3, 2025
‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.


