News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

Similar News

News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 300 నామినేషన్లు వేస్తాం: మందాల భాస్కర్

image

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఈరోజు HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. మాలలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 300 మంది మాలలు నామినేషన్లు వేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాదాల భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News October 13, 2025

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేకు జర్నలిజం మీద మక్కువ

image

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి వృద్ధాప్య సమస్యలతో HYDలోని అపోలో ఆస్పత్రిలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితాంతంల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2 సార్లు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన జర్నలిజంపై మక్కువతో న్యూస్ సర్వీస్ సిండికేట్ సంస్థను స్థాపించారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర జరగనుంది.

News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు గెజిట్‌ విడుదల

image

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవాళ్లి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. వచ్చే నెల 11న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.