News May 23, 2024
HYD: నిఖత్ జరీన్‌కు సన్మానం

ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.
Similar News
News December 22, 2025
ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో TG అధ్యాపకుడికి గోల్డ్ మెడల్

బెంగుళూరులో జరిగిన 76వ ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణకు గోల్డ్ మెడల్ లభించింది. ఓయూ పూర్వ విద్యార్థి అయిన రామకృష్ణ ప్రస్తుతం కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండోజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీని డిజిటల్ ఎకానమీలో సమీకరించడంపై సమర్పించిన పరిశోధనా పత్రం ఉత్తమంగా ఎంపికైంది.
News December 22, 2025
నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News December 22, 2025
HYD: డిసెంబరులోనూ డెంగ్యూ పంజా.. జర భద్రం !

సాధారణంగా వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. డిసెంబరు నెలలోనూ డెంగ్యూ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 10 రోజుల్లో నగరంలో నాలుగుకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క నవంబరులోనే సుమారు 90కి పైగా డెంగ్యూ, వైరల్ జ్వరాల కేసులు ఫీవర్ ఆసుపత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు.


