News March 19, 2024

HYD: ‘నిజంగా SI లానే ఆమె చేసేది’

image

HYD శివారు శంకర్‌పల్లి RPF SI అంటూ యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్‌లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 9, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రేపు EVMల డిస్ట్రిబ్యూషన్

image

11న జరిగే జూబ్లీహిల్స్ బైపోల్‌‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఉ.7 గం. నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ‘10న సా. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం నుంచి EVM డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 4 EVM మెషీన్లకు 3 అంచెల భద్రత ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 45, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీమ్‌లు 2 ఉంటాయి’ అని ఆయన వెల్లడించారు.

News November 9, 2025

ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

image

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో అంతా గప్‌చుప్..!

image

దాదాపు నెలరోజులుగా స్పీకర్ సౌండ్‌లు, ఓటర్లతో మీటింగ్‌లు, హామీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హోరెత్తింది. ఇవాళ ముగింపు ప్రచారంలో 3 ప్రధాన పార్టీల నేతలు చెలరేగిపోయారు. కాగా ఎలక్షన్‌కు 48గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధనతో అంతా గప్‌చుప్ అయింది. ఇక గప్‌చుప్‌గా లోకల్ నేతల హవా నడువనుంది. నోట్ల పంపిణీ, ఓటర్లను మచ్చిక చేసుకోవడం అంతా వీరి చేతుల్లోనే ఉంటుందిక. మళ్లీ సంబరాలు రిజల్ట్స్ డే రోజే ఇక.