News August 14, 2024
HYD: నిమ్స్‌లో ఏడాదిలో 300 రోబో చికిత్సలు

రోబో చికిత్సలు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 300 వరకు శస్త్రచికిత్సలు చేసిన అరుదైన ఘనతను నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న పేద రోగులకు ఉచితంగా, ఇతర రోగులకు తక్కువ ఖర్చుతోనే ఈ సేవలందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు పరిమితమైన ఈ రోబోటిక్ సేవలను గతేడాది ఆగస్టులో దాదాపు రూ.30 కోట్లతో నిమ్స్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఎక్కువ శాతం ఈ సేవలు పేదలకే అందుతున్నాయి.
Similar News
News February 23, 2026
HYD: పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని, నదిని మాత్రమే శుద్ధి చేయాలని కోరారు. తక్షణమే కూల్చివేతలను ఆపాలన్నారు.
News February 23, 2026
HYD: ఇకపై అలాంటివారిని పట్టిస్తే రూ.200/-

మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు. ఇలా నీటిని ఆదా చేసినందుకు మీకు రూ.200ల నగదు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.
News February 23, 2026
HYD: MCHRD.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా..?

HYDలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ.9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్‌కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్ఠమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. దీనిని CM క్యాంప్ ఆఫీస్‌గా వాడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


