News August 14, 2024
HYD: నిమ్స్‌లో ఏడాదిలో 300 రోబో చికిత్సలు
రోబో చికిత్సలు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 300 వరకు శస్త్రచికిత్సలు చేసిన అరుదైన ఘనతను నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న పేద రోగులకు ఉచితంగా, ఇతర రోగులకు తక్కువ ఖర్చుతోనే ఈ సేవలందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు పరిమితమైన ఈ రోబోటిక్ సేవలను గతేడాది ఆగస్టులో దాదాపు రూ.30 కోట్లతో నిమ్స్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఎక్కువ శాతం ఈ సేవలు పేదలకే అందుతున్నాయి.
Similar News
News January 15, 2025
త్వరలో OUలో ఇంజినీరింగ్ కోర్సులు
ఉన్నత విద్యా మండలి, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ఆమోదంతో త్వరలో ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఓయూ అధికారులు తెలిపారు. ఉపాధి కల్పన, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పించేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కోర్సుల్లో ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థల తరహాలో పాఠ్యాంశాలను రూపొందించనున్నాయి.
News January 15, 2025
HYD: నుమాయిష్‌లో పోలీసుల బందోబస్తు
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News January 15, 2025
HYD: పోరాట యోధుడి జయంతి నేడు
1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.