News June 29, 2024
HYD: నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరాను: MLA

చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
HYD: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం: KTR

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
News November 24, 2025
HYD: ‘విద్యార్థుల వివరాలు వారంలో పంపండి’

HYDలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను వారంలోపు పంపిచాలని కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్పై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో DRO వెంకటాచారితో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల వివరాలు వారంలోపు అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
News November 24, 2025
ఆర్జీలను సత్వరమే పరిష్కరించండి: HYD కలెక్టర్

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో అందచేసిన అర్జీలను సత్వరమే అధికారులు స్పందించి పరిష్కరించాలని HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు కదివన్ పలని, ముకుంద రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.


