News November 30, 2024
HYD: నిరసన వ్యక్తం చేసి.. వినతిపత్రం అందించిన కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తున్న అధికారులను కొత్తపేట బీజేపీ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, ఇతర బీజేపీ కార్పొరేటర్లు అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని ఉన్న సమస్యలను, మహానగరంలో ఉన్న సమస్యలను మేయర్ కి తెలియజేసి వినతి పత్రాన్ని అందజేశారు.
Similar News
News December 3, 2024
HYD: ఈ మెసేజ్ క్లిక్ చేస్తే DP ఛేంజ్: పోలీసులు
వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5,899 రివార్డు పాయింట్లు వస్తాయనే ఓ మెసేజ్ వచ్చిందా..? జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీసులు సూచించారు. ‘సోషల్ మీడియాలో APK ఫైల్ యాప్ పంపిస్తున్నారు. క్లిక్ చేస్తే వాట్సాప్ ప్రొఫైల్ యూనియన్ బ్యాంక్ ఫొటోగా మారుతుంది. తర్వాత ఎడిట్ కూడా కావడం లేదు. దీనిపై జాగ్రత్త..!’ అని పోలీసులు సూచించారు. SHARE IT
News December 3, 2024
HYD: పాములు పట్టుకునే వారికోసం కాల్ చేయండి!
నగరంలో పలుచోట్ల పాములు కనిపించినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి వారికి వెటర్నరీ అధికారులు శుభవార్త తెలిపారు. పాముల సంబంధిత ఫిర్యాదుల కోసం బోర్డు పై ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే వారు వచ్చి, పాములను పట్టుకుంటారని GHMC అధికారులు పేర్కొన్నారు.
News December 2, 2024
HYD: చేవెళ్ల యాక్సిడెంట్.. CM రేవంత్ దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదంలో రైతులు ప్రేమ్(ఆలూరు), రాములు(ఆలూరు), సుజాత(ఖానాపూర్ ఇంద్రారెడ్డినగర్) అక్కడికక్కడే చనిపోయారు.