News July 1, 2024

HYD: నిరుద్యోగులు.. మోసపోకండి: సజ్జనార్

image

నిరుద్యోగుల ఆశను అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుని నట్టేట ముంచుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ HYDలో అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి.. సైబర్ నేరాలు చేయిస్తున్నారని, ఇటీవల కంబోడియాలో నిరుద్యోగ యువత వారి వలలో చిక్కుకున్నారని తెలిపారు. తాజాగా శ్రీలంకలోనూ సైబర్ నేరాలు చేస్తున్నారంటూ దాదాపు 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

HYD: నేటి నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ మూసివేత

image

గచ్చిబౌలి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ఈనెల 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌లో SRDP శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

News September 20, 2024

HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి కాదు అబ్బాయి!

image

న్యూడ్ కాల్స్ పేరిట యువకులను మోసం చేస్తున్న వ్యక్తిని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బెంగుళూరు వాసి రిషద్ బేడీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి లాగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, పలువురు యువకులను ఆకట్టుకున్నాడు. బాధితుల న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

News September 19, 2024

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.