News January 7, 2025
HYD: నిర్లక్ష్యం వద్దు.. మళ్లీ మాస్కు ధరించండి

hMPV వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో HYD పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. నమస్కారం ముద్దు – హ్యాండ్‌షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అని తెలిపింది.
Similar News
News November 19, 2025
HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్‌లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్‌టోర్షన్‌కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.
News November 19, 2025
17వ వార్షికోత్సవంలోకి ట్రూ జోన్ సోలార్

తెలంగాణకు చెందిన పాన్-ఇండియా సోలార్ కంపెనీ అయిన ట్రూజోన్ సోలార్ (సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్) బుధవారంతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా ట్రూజోన్ దేశంలోని అత్యంత విశ్వసనీయ సోలార్ బ్రాండ్లలో ఒకటిగా అవతరించింది. కస్టమర్-ఫస్ట్ విధానంతో ట్రూజోన్ సోలార్ భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది.
News November 19, 2025
HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.


