News February 12, 2025
HYD: నిలోఫర్ డాక్టర్లు.. మీరు GREAT

ప్రాణాపాయ స్థితిలో ఉన్న 27 వారాల గర్భవతి వి.కవిత(35)కి HYD నీలోఫర్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. కవిత VKB జిల్లా వాసి కాగా.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. మూత్రాశయం మీద ఉన్న చీలికలని వైద్యులు సరి చేశారు. 1KG మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో భారీగా రక్తం అవసరం పడిందని నిలోఫర్ సూపరింటెండెంట్ డా.రవి కుమార్ తెలిపారు. డాక్టర్లను మంత్రి రాజనర్సింహ అభినందించారు.
Similar News
News October 22, 2025
25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 22, 2025
విజయవాడ: దుర్గగుడిలో పాముకాటుకి గురైన భక్తుడు

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో పాము కలకలం రేపింది. క్యూలైన్లో ఓ భక్తుడు అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా పాము కాటు వేసింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా వర్షాలు పడటంతో కొండపై నుంచి పాములు వస్తున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ రెండు పాములు రాగా.. ఓ పాము డోనర్స్ సెల్ దగ్గర వున్న భక్తుడిని కాటు వేసింది. విష సర్పం కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.