News September 18, 2024
HYD: నీటి వారోత్సవాల్లో మంత్రి ఉత్తమ్

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 8వ అంతర్జాతీయ నీటి వారోత్సవ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా నీటి నిర్వహణ, అభివృద్ధి, సహకారంపై కీలకమైన అంశాలపై చర్చించారు. జలవనరుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ప్రదర్శించారు.
Similar News
News October 15, 2025
మేడ్చల్, రంగారెడ్డిని సపరేట్ చేసేదే మూసీ

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ఉద్భవించిన మూసీ ప్రతాపసింగారం గుండా పరుగులు పెడుతోంది. ఇక్కడి భౌగోళిక ప్రత్యేకతలో ఈ నది విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. తూర్పు, దక్షిణం దిశలుగా ముచుకుందా(మూసీ) ప్రవహిస్తోంది. సుమారు 4.5 కి.మీ. పొడవున తీరరేఖను ఏర్పరుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దుగా ఈ నది ఉంది. నల్లగొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తోంది.
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.
News October 15, 2025
HYD: ఎన్నికల వేళ.. జ్యోతిషులు ఫుల్ బిబీ

ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇంకా నామినేషన్ వేయకముందే వారిలో ఒకరకమైన ఆందోళన.. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమకు ఏ రోజు మంచిదో చూసుకొని నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే సిటీలో పంచాంగ కర్తలు, జ్యోతిషులు బిబీ.. బిజీగా మారారు. పేరు, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ప్రకారం జాతకం చూస్తూ ఎప్పుడు నామినేషన్ వేయాలో, ఏమేం పూజలు చేయాలో చెబుతున్నారు.