News April 9, 2024
HYD నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారా..? మీ కోసమే!

HYD నుంచి వరంగల్ NH-163పై వెళ్లే మార్గంలో భువనగిరి వద్ద.. పెంచిన టోల్గేట్ ఛార్జీల పట్టికను అధికారులు ఏర్పాటు చేశారు. కారు, జీపు, LMV వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.115, 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.170 ఛార్జి వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలకు వన్ సైడ్ ట్రిప్ రూ.175.. 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.265గా ఉందని తెలిపారు.
Similar News
News October 19, 2025
RR: భారీగా తగ్గిన అప్లికేషన్స్.. గడుపు పొడిగింపు

వైన్స్ టెండర్ల గడువు ఈనెల 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు సుమారు 13,300పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సరూర్నగర్ డివిజన్లో 138 వైన్స్ షాపులకు 7,000, శంషాబాద్ డివిజన్లో 111 షాపులకు 6,300లకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది జిల్లాలో 21,665 దరఖాస్తులు రాగా రూ.4.32 కోట్ల ఆదాయం సమకూరింది.
News October 19, 2025
నేడు HYDలో సీఎం పర్యటన వివరాలిలా..

నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతల్లో పర్యటించనున్నారు. ఉ.11.30కు చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమల్లో హాజరవుతారు. 12 గంటలకు NTR స్టేడియం ఎదురుగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్లు అందించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.
News October 19, 2025
‘ఆట’ విడుపు.. క్రికెట్తో సేదదీరిన హైడ్రా సిబ్బంది

హైడ్రా సిబ్బంది శనివారం ఫతుల్గూడలోని క్రీడామైదానంలో ఫ్లడ్లైట్ల కాంతిలో క్రికెట్ ఆడుతూ సేదతీరారు. అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల మధ్య జట్ల పోటీ ఉత్సాహంగా సాగింది. కమిషనర్ రంగనాథ్, అదనపు కమిషనర్లు అశోక్ కుమార్, సుదర్శన్, డైరెక్టర్ వర్ల పాపయ్య పాల్గొన్నారు. క్రీడలు జట్టు స్ఫూర్తిని పెంచుతాయని కమిషనర్ అన్నారు.