News January 13, 2025

HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది

image

HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

HYD: అమెరికాలో బాత్రూంలు కడిగే వారికి ఏం తెలుసు?: చిన్నశ్రీశైలం యాదవ్

image

పహిల్వాన్లకు, రౌడీలకు తేడా తెలియకుండా BRS వాళ్లు సన్నాసుల్లా మాట్లాడుతున్నారని నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. HYDలోని వ్యాయామశాలల్లో ఉండే వారిని పహిల్వాన్లు అంటారని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని రౌడీలు అంటారన్నారు. అమెరికాలో బాత్రూంలు కడిగేవారికి HYD సంస్కృతి గురించి ఏం తెలుసు అని KTRపై పరోక్షంగా మండిపడ్డారు.

News November 15, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌కు TDP అభిమానుల మద్దతు కలిసొచ్చిందా..?

image

TDP అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ నేతల మద్దతు కాంగ్రెస్‌కు కలిసొచ్చిందంటూ చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రచారంలోనూ TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు కనిపించాయి. 20 ఏళ్లు TDP ఫ్యాన్స్ మాగంటి గోపీనాథ్ వెంటే ఉన్నారు. కాగా నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తోపాటు CM రేవంత్ రెడ్డి గతంలో TDP నేతలు కావడంతో ఆ పార్టీ అభిమానుల ఓట్లు ఈసారి BRSకు కాకుండా కాంగ్రెస్‌కు వేసినట్లు టాక్.

News November 15, 2025

HYD: ఆధ్యంతం నాటకీయం.. చివర్లో తారుమారు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ అభ్యర్థుల ప్రకటనుంచి రిజల్ట్స్ వరకు నాటకీయంగా సాగింది. ప్రభుత్వంపై సర్వేల్లో, ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. మరోవైపు సిట్టింగ్, సెంటిమెంట్, ఎర్లీక్యాంపెయిన్ చేసిన BRSకు 10% ఆధిక్యత కనిపించింది. కానీ క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. గ్రౌండ్‌ వర్క్‌లో BRS తేలిపోగా, కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేస్తూ సక్సెస్ అయిందనేది విశ్లేషకుల మాట. దీనిపై మీ కామెంట్.