News January 27, 2025
HYD: నుమాయిష్కు పోటెత్తిన సందర్శకులు

ఆదివారం సెలవు దినం కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు సందర్శకులు పోటెత్తారు. గణతంత్ర వేడుకలు ఉండటంతో దాదాపు 80 వేల మంది సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అటవీ, కార్మిక, జైళ్ల శాఖల స్టాళ్లలో ప్రభుత్వ పథకాలు, ప్రగతిపై సందర్శకులకు వివరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 7, 2026
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మరోసారి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.
News January 7, 2026
NTR: Way2News కథనాలకు అధికారుల స్పందన.!

తిరువూరు మెప్మా పరిధిలో రూ.17కోట్ల రుణాల గోల్మాల్పై ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. Way2News కథనాలకు స్పందించిన రాష్ట్ర మెప్మా కార్యాలయం, ఆరుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపింది. బుధవారం తిరువూరు మెప్మా కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసిన బృందం.. డ్వాక్రా మహిళల పేరిట మంజూరైన రుణాలపై ఆరా తీసింది. వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాశామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News January 7, 2026
జిల్లాలో 46 రైల్వే వంతెనలకు లైన్ క్లియర్: జేసీ రాహుల్

జిల్లాలో ప్రతిపాదించిన 50 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల పనుల్లో పురోగతి లభించింది. ఇందులో 46 నిర్మాణాలకు మంజూరు లభించినట్లు జేసీ రాహుల్ వెల్లడించారు. బుధవారం భీమవరంలో తన ఛాంబర్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వీటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైల్వే సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా 30 మీటర్ల పరిధిలో త్వరితగతిన కొలతలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


