News February 16, 2025
HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
Similar News
News April 19, 2026
ఆర్కేబీచ్ రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

ఆర్కేబీచ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫిషింగ్ హార్బర్ వైపు వెళ్తున్న బైకర్ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
సింహాచలం చందనోత్సవం బస్సులకు స్త్రీ శక్తి వర్తింపు: RTC

సింహాచలం చందనోత్సవం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు విశాఖ ఆర్‌ఎం అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. కొండపై నుంచి గోశాలకి 50, అడివివరం వైపు 30 బస్సులు నడుస్తాయి. ద్వారకా, గాజువాక నుంచి 60, విజయనగరం, చోడవరం, కొత్తవలస నుంచి 50.. అనకాపల్లి నుంచి 40 బస్సులు ఉన్నాయి. మొత్తం 300 బస్సులు సిద్ధం చేశామన్నారు. వీటన్నింటికీ స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని చెప్పారు.
News April 19, 2026
‘శారీరక అవసరాలు ఉంటే చెప్పు’.. TCS కేసులో సంచలన విషయాలు

TCS మతమార్పిడి కేసులో ఓ బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2025లో కంపెనీలో చేరిన కొత్తలో వేరే విభాగానికి చెందిన రెజా, ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో ఆసిఫ్ అన్సారీ వేధించారని పేర్కొంది. ఉద్యోగ రీత్యా భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా మాట్లాడేవారని పేర్కొంది. ‘ఏమైనా శారీరక అవసరాలు ఉంటే చెప్పు. బుర్ఖా లేకనే మీ మతంలో ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతున్నారు’ అని అన్సారీ వేధించాడని తెలిపింది.


