News July 6, 2024
HYD: నురగలు కక్కి చనిపోయాడు..!

కడుపు నొప్పితో ఓ లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం ఇచ్ఛాపురం వాసి ఢిల్లీ రావు(38) నేపాల్ నుంచి చీపురు కట్టల లోడుతో జవహర్‌నగర్‌కు చేరుకున్నాడు. లోడ్ దించిన అనంతరం డ్రైవర్‌ను లేపుదామని క్లీనర్ వెళ్లగా నురగలు కక్కి మృతిచెందాడు. అయితే అంతకుముందు అతడు 2 మాత్రలు వేసుకుని, ENO తాగాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదైంది.
Similar News
News December 22, 2025
FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News December 22, 2025
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 22, 2025
జీహెచ్ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు

జీహెచ్ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వార్డుల విభజన చేశారని లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వార్డుల మ్యాప్, జనాభా వివరాలపై సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.


